ఏపీలో మళ్లీ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు
- రాష్ట్రంలో కొన్నిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు
- వర్షాలు లేకపోగా ఉక్కపోతతో జనం ఇక్కట్లు
- చల్లని కబురు తెచ్చిన ఐఎండీ
- మూడ్రోజుల పాటు ఏపీలో వర్షాలు
ఏపీలో గత కొన్నిరోజులుగా వర్షాలు పడకపోగా, వేడి వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు మాసపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు వినిపించింది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఐఎండీ వెల్లడించింది.
తాజాగా ఉత్తర బంగాళాఖాతం మీదుగా వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో గురు, శుక్ర, శనివారాల్లో ఏపీలో కొన్నిచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, శుక్రవారం నాడు రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.