రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు.. వీడియో ఇదిగో!
- కుప్పంలో అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తలు
- క్యాంటీన్ వరకు టీడీపీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లిన చంద్రబాబు
- పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ ను ధ్వంసం చేశారని ఆవేదన
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పం బస్టాండ్ వద్ద చంద్రబాబు ప్రారంభించాల్సి ఉన్న అన్నా క్యాంటీన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోయాయి. చంద్రబాబు సహా పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అన్నా క్యాంటీన్ వద్దకు ర్యాలీగా వెళ్లారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి క్యాంటీన్ వరకు ర్యాలీ కొనసాగింది.
కాగా, అన్నా క్యాంటీన్ ఎదురుగా చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా 'సీఎం జగన్ డౌన్ డౌన్' అంటూ టీడీపీ కార్యకర్తలు నినదించారు. మరోమైపు చంద్రబాబు మాట్లాడుతూ, పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ ను ధ్వంసం చేయాలని వైసీపీ వాళ్లకు ఎలా అనిపించిందని ప్రశ్నించారు.
ఇంకో వైపు, వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ఇంటి వైపు వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు యత్నించగా... వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. కొందరు కార్యకర్తలకు తలలపై దెబ్బలు తగిలి తీవ్ర రక్తస్రావమయింది. ఈ నేపథ్యంలో, పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపడ్డారు.