ఐయోడైజ్డ్ ఉప్పు చాలా అవసరం..
- థైరాయిడ్ గ్రంధి సక్రమ పనితీరుకు అయోడిన్ కావాలి
- రాక్ సాల్ట్ తో అయోడిన్ అందదు
- కాకపోతే రాక్ సాల్ట్ లో సోడియం తక్కువ
ఆరోగ్యం పట్ల నేటి ప్రజల్లో శ్రద్ధ, ఆసక్తి పెరుగుతోంది. ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో ఉప్పు, చక్కెరలకు ఎంతో శక్తి ఉంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే నష్టాలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అయితే ఉప్పులోనూ చాలా రకాలు ఉన్నాయి. రెండు దశాబ్దాల క్రితం సముద్రపు ఉప్పు లభించేది.
ఆ తర్వాత ఐయోడిన్ కలిపిన ఉప్పునే విక్రయించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు తెచ్చింది. ఐయోడిన్ తో థైరాయిడ్ గ్రంధి పనితీరు అస్తవ్యస్తం అవుతోందన్న విమర్శలు అయితే ఉన్నాయి. కానీ, ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదు. ఇక రాతి ఉప్పు పట్ల ప్రజల్లో స్పృహ పెరిగింది. ఇది ఆరోగ్యానికి మంచిదన్న అభిప్రాయంతో ఇటీవల రాక్ సాల్ట్ వినియోగం పెరుగుతోంది. దీనివల్ల ఐయోడిన్ లోపం ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఐయోడిన్ హాని చేస్తుందని ఎక్కువ మంది భావిస్తుంటారు. కానీ, ఉప్పులో అధిక పరిమాణంలో ఉండే సోడియంతోనే అసలు సమస్య అన్నది వైద్యులు చెప్పే మాట. సోడియం అన్నది అన్ని రకాల ఉప్పుల్లో ఉంటుంది. అలాగే, రాతి ఉప్పులోనూ ఉంటుంది కానీ తక్కువ. కానీ, రాతి ఉప్పులో ఐయోడిన్ ఉండదు. సోడియం కొంచెం తక్కువగా ఉంటుంది. దీనివల్ల కేవలం రాతి ఉప్పును తీసుకోవడం ఐయోడిన్ లోపానికి దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
థైరాయిడ్ పనితీరుకు కావాలి
‘‘ఐయోడిన్ అన్నది థైరాయిడ్ గ్రంధికి అవసరమైన పోషకం. ఈ పోషకం తగినంత అందినప్పుడు థైరాయిడ్ గ్రంధి పనితీరు కూడా సాధారణంగా ఉంటుంది. తగినంత పోషకం అందనప్పుడు థైరాయిడ్ గ్రంధి పరిమాణం పెరిగిపోతుంది. గొంతు నొప్పికి దారితీస్తుంది. థైరాయిడ్ స్థాయులు తక్కువగా ఉండే హైపోథైరాయిడిజం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని పోషకాహార నిపుణురాలు కవితా దేవ్ గన్ తెలిపారు. ఉప్పుతోనే ఐయోడిన్ కలపడం ఎందుకు? అన్న ప్రశ్న రావచ్చు. ఎందుకంటే ప్రతీ వంటకంలో ఉప్పు తప్పకుండా అవసరం కనుక. దీనివల్ల అందరికీ ఐయోడిన్ అందించొచ్చన్నది ఉద్దేశ్యం.
రోజులో ఉప్పు మోతాదు
మన దేశంలో తలసరి ఉప్పు వినియోగం రోజులో 11 గ్రాములుగా ఉంది. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ఒక వ్యక్తి రోజులో 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. ముఖ్యంగా మనం వినియోగించే ఉప్పులో అధిక భాగం ప్రాసెస్డ్, రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్స్ నుంచే ఉంటోంది. ఇంట్లో చేసుకునే పదార్థాల రూపంలో తీసుకునే ఉప్పు పరిమితంగానే ఉంటుంది. కనుక బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే రుచి కోసం, నిల్వ కోసం ప్రాసెస్డ్ ఫుడ్స్ లో అధికంగా ఉప్పు వినియోగిస్తుంటారు.
గుండెకు చేటు
సోడియం ఎక్కువైతే అది గుండెకు ఎంతో హాని చేస్తుంది. శరీరంలో సోడియం ఎక్కువైతే అది ఎక్కువ నీరును శరీరంలో నిలిచి ఉండేలా చేస్తుంది. దీంతో రక్త పరిమాణం పెరిగిపోతుంది. బరువు పెరిగిపోతారు. రక్తపోటు పెరిగి రక్తనాళాలు బలహీనపడేందుకు కారణమవుతుంది. ఒక టీస్పూన్ టేబుల్ సాల్ట్ లో 2360 ఎంజీ సోడియం లభిస్తుంది. ఒక టీ స్పూన్ హిమాలయన్ సాల్ట్ లో 1680 మిల్లీగ్రాముల సోడియం లభిస్తుంది.
రోజువారీగా తీసుకోవాల్సిందే
రోజువారీగా ఐయోడైజ్డ్ సాల్ట్ ను తీసుకున్నప్పుడే మన శరీరానికి అవసరమైన ఐయోడిన్ అందుతుంది. మరే రూపంలోనూ ఐయోడిన్ ను భర్తీ చేసుకోలేం. చేపలు, పాల ఉత్పత్తుల్లో, గుడ్లలో, చికెన్ లో ఐయోడిన్ ఉంటుంది. కానీ, మన శరీరానికి కావాల్సింత లభించదు.
ఐయోడిన్ ఎంత..?
పెద్ద వారికి ఒక రోజులో 140 మైక్రో గ్రాముల ఐయోడిన్ అవసరం. గర్బంతో ఉన్న వారికి రోజువారీగా 220 మైక్రో గ్రాముల ఐయోడిన్ అవసరం. గర్భస్థ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఐయోడిన్ ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు.