జియో నుంచి నాలుగు రకాల వార్షిక ప్లాన్లు.. వివరాలు ఇవిగో

  • రూ.2,545 ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు
  • 1.5 జీబీ నుంచి 3జీబీ వరకు రోజువారీ ఉచిత డేటా
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఉచిత ప్యాక్
రిలయన్స్ జియో ప్రీపెయిడ్ కస్టమర్లు ప్రతి నెలా రీచార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా ఒకేసారి ఒక ఏడాది ప్లాన్ తీసుకోవాలంటే.. వారి ముందు నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. 

రూ.2,545
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు. అంటే సుమారు 11 నెలలు. రోజువారీ 1.5జీబీ డేటాను అధిక వేగంతో అందుకోవచ్చు. రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. 

రూ.2,879  
దీని గడువు ఏడాది. రోజువారీగా 2జీబీ ఉచిత డేటా లభిస్తుంది. రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు, ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. 

రూ.2,999
ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా ఏడాది కాలం. రోజువారీ 2.5జీబీ ఉచిత డేటాను అధిక వేగంతో పొందొచ్చు. రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు, ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ను ఏడాది పాటు ఉచితంగా పొందొచ్చు. 

రూ.4,199
జియోలో ఖరీదైన ప్లాన్ ఇది. 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజువారీ 3జీబీ డేటాను అధిక వేగంతో ఉచితంగా పొందొచ్చు. రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు, ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ను ఏడాది పాటు ఉచితంగా పొందొచ్చు. ఈ ప్లాన్లు అన్నింటిలోనూ జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా లభిస్తాయి.


More Telugu News