ప్రధానితో చేయి కలిపింది.. ప్రోటోకాల్ కోసమే: కాంగ్రెస్ నేత మనీష్ తివారీ

  • ప్రధాని వస్తే మర్యాదపూర్వకంగా ఆహ్వానించాల్సి వుందన్న కాంగ్రెస్ నేత
  • రాజకీయ విభేదాలు వేరన్న మనీష్
  • శ్రీఆనంద్ పూర్ లో కేన్సర్ హాస్పిటల్ ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీతో కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ చేయి కలపడంపై వస్తున్న విమర్శలకు ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఓ జర్నలిస్ట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రధాని బుధవారం పంజాబ్ లోని శ్రీ ఆనంద్ పూర్ లో హోమీబాబా కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు. 

ఈ నియోజకవర్గం ఎంపీగా మనీష్ తివారీ ప్రోటోకాల్ ప్రకారం ప్రధానికి స్వాగతం పలికి, షేక్ హ్యండ్ ఇచ్చారు. ‘‘శ్రీ నరేంద్రమోదీ నా పార్లమెంటరీ నియోజకవర్గమైన శ్రీ ఆనంద్ పూర్ సాహిబ్ ను సందర్శిస్తే రాజకీయ పరమైన విభేదాలు ఉన్నప్పటికీ, వాటిని పక్కనపెట్టి, ప్రోటోకాల్ ప్రకారం   మర్యాదపూర్వకంగా ఆహ్వానించాల్సి వుంది’’ అని మనీష్ తివారీ ట్వీట్ చేశారు. ఈ హాస్పిటల్ కు 2013 డిసెంబర్ 30న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పునాది రాయి వేయగా, ప్రధాని నరేంద్ర మోదీ నేడు దాన్ని పూర్తి చేసినట్టు చెప్పారు.


More Telugu News