భారత్-ఎ జట్టుకు ఎంపికైన హైదరాబాదీ తిలక్ వర్మ
- దేశవాళీ మ్యాచులలో రాణిస్తున్న తిలక్
- ఐపీఎల్ లో ముంబై తరఫున సత్తా చాటిన యంగ్ స్టర్
- న్యూజిలాండ్-ఎ జట్టుతో అనధికార టెస్టు సిరీస్ కు ఎంపిక
హైదరాబాద్ యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మకు ప్రమోషన్ లభించింది. దేశవాళీ క్రికెట్‌తో పాటు గత సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కు ఎంపికై తన డాషింగ్ బ్యాటింగ్ తో సత్తా చాటిన తిలక్ కు భారత్-ఎ జట్టు నుంచి తొలిసారి పిలుపు వచ్చింది. న్యూజిలాండ్ -ఎ జట్టుతో జరిగే మూడు అనధికార టెస్టుల (నాలుగు రోజుల మ్యాచ్‌లు) కోసం ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ బుధవారం జట్టును ప్రకటించింది. ప్రియాంక్ పాంచల్ కెప్టెన్సీలోని ఈ జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేఎస్ భరత్ కూడా ఎంపికయ్యాడు.
దేశవాళీల్లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, రజత్ పటీదార్ తోపాటు భారత క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, రాహుల్ చహర్, ప్రసిధ్ కృష్ణ, ఉమ్రాన్ మాలిక్‌లను కూడా సెలెక్టర్లు ఈ జట్టులోకి తీసుకున్నారు. వచ్చే నెల భారత పర్యటనకు రానున్న న్యూజిలాండ్-ఎ జట్టు.. భారత్-ఎతో మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. బెంగళూరు, హుబ్లీలో సెప్టెంబర్ 1- 18 మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. చెన్నై వేదికగా సెప్టెంబర్ 22, 25, 27వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.
భారత్–ఎ జట్టు: ప్రియాంక్ పాంచల్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్, రజత్, సర్ఫరాజ్, తిలక్ వర్మ, భరత్ (కీపర్), ఉపేంద్ర యాదవ్ (కీపర్), కుల్దీప్ యాదవ్, సౌరభ్ కుమార్, రాహుల్ చహర్, ప్రసిధ్ కృష్ణ, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్, యశ్ దయాల్, అర్జాన్.