ఏపీ విభజన అంశాలపై రేపు కేంద్ర ఆర్థిక శాఖ కీలక భేటీ... హాజరుకానున్న బుగ్గన, సాయిరెడ్డి
- ఇటీవలే ప్రధానిని కలిసిన సీఎం
- ఏపీ సమస్యలను ఏకరువు పెట్టిన జగన్
- సమస్యల పరిష్కార బాధ్యతను ఆర్థిక శాఖ కార్యదర్శికి అప్పగించిన మోదీ
- రేపు ఏపీ ప్రతినిధి బృందంతో భేటీ కానున్న సోమనాథన్
ఏపీకి చెందిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఓ కీలక భేటీని నిర్వహించనుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ భేటీకి ఏపీ తరఫున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు హాజరు కానున్నారు.
ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం సవరించిన అంచనాలు, రాష్ట్ర లోటు బడ్జెట్‌ను భర్తీ చేసే అంశం తదితరాలపై ప్రధానికి ఆయన ఓ వినతి పత్రం అందజేశారు. దీంతో స్పందించిన మోదీ... కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిని పిలిచి ఈ వ్యవహారాలను పరిష్కరించాలని సూచించారట. ప్రధాని ఆదేశాల నేపథ్యంలో సోమనాథన్ గురువారం కీలక భేటీని నిర్వహిస్తున్నట్లు సమాచారం.