ప్రియాంకా గాంధీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
- కోమటిరెడ్డికి స్వయంగా కబురు పంపిన ప్రియాంక
- ప్రియాంకా గాంధీతో ఏకాంతంగా భేటీ అయిన కోమటిరెడ్డి
- సమస్య ఉంటే తనను నేరుగా కలవాలని కోమటిరెడ్డికి సూచన
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జీ ప్రియాంకా గాంధీతో తెలంగాణకు చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికపై రెండు రోజుల క్రితం ఢిల్లీలో ప్రియాంక నిర్వహించిన భేటీకి డుమ్మా కొట్టిన కోమటిరెడ్డిని స్వయంగా ప్రియాంకే తనతో భేటీకి రావాలంటూ కబురు పంపారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీ వెళ్లి ప్రియాంకా గాంధీతో భేటీ అయ్యారు.
ఈ భేటీ ముగిశాక బయటకు వచ్చిన కోమటిరెడ్డి అక్కడే మీడియాతో మాట్లాడారు. పార్టీలో నేతలంతా కలసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని ప్రియాంకా గాంధీ చెప్పినట్లుగా ఆయన వివరించారు. అదే సమయంలో ఏదేనీ సమస్య ఉంటే...ఎప్పుడైనా నేరుగా వచ్చి తనతో కలవవచ్చని కూడా తెలిపారన్నారు. ఇక భేటీలో పార్టీ పటిష్ఠత, వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించినట్లు తెలిపారు. ఈ విషయాలకు సంబంధించి తాను ప్రియాంకకు కొన్ని సలహాలు ఇచ్చినట్లు కోమటిరెడ్డి చెప్పారు.