పూరి స్టైల్లో ఒక్క సినిమా చేసినా చాలనుకున్నాను: సుకుమార్
- రేపు విడుదలవుతున్న 'లైగర్'
- పూరిని ఇంటర్వ్యూ చేసిన సుకుమార్
- పూరినే తనకి ఆదర్శమంటూ వ్యాఖ్య
- ఇకపై ఆయన స్టైల్ ను ఫాలో అవుతానన్న పూరి
ప్రపంచవ్యాప్తంగా రేపు 'లైగర్' రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు పూరిని మరో దర్శకుడు సుకుమార్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంలోనే తాను ఇండస్ట్రీకి రావడానికి ముందు జరిగిన సంఘటనలను పూరి దగ్గర ప్రస్తావించాడు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడానికి తాను గట్టిగానే ట్రై చేసినట్టు చెప్పాడు. ఫస్టు టైమ్ అమీర్ పేట్ లోని ఒక కాఫీ హోటల్లో ఆయనను కలుసుకున్నానని అన్నాడు.
పూరి చేసిన 'ఇడియట్' సినిమా అంటే తనకి చాలా ఇష్టమనీ, అప్పటివరకూ వస్తున్న ప్రేమకథలను ఆ సినిమా బ్రేక్ చేసిందని సుకుమార్ చెప్పాడు. పూరి స్టైల్లో అలాంటి సినిమా ఒక్కటి చేసినా చాలని తనకి అప్పుడు అనిపించిందని అన్నాడు. ఆయనలా టెన్షన్ పడకుండా కూల్ గా .. ఫాస్టుగా సినిమా చేయడానికి ట్రై చేస్తున్నా తన వల్ల కావడం లేదని చెప్పాడు.
అందుకు పూరి నవ్వుతూ .. "ఇంతవరకూ చాలా ఫాస్టుగా సినిమాలు చేస్తూ వచ్చాను. ఇక ఇప్పుడు అంతగా పరిగెత్తవలసిన అవసరం లేదనిపిస్తోంది. సుకుమార్ మాదిరిగా సమయం తీసుకుని .. బలమైన కంటెంట్ తోనే సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చాను" అంటూ సమాధానమివ్వడం విశేషం. .
పూరి చేసిన 'ఇడియట్' సినిమా అంటే తనకి చాలా ఇష్టమనీ, అప్పటివరకూ వస్తున్న ప్రేమకథలను ఆ సినిమా బ్రేక్ చేసిందని సుకుమార్ చెప్పాడు. పూరి స్టైల్లో అలాంటి సినిమా ఒక్కటి చేసినా చాలని తనకి అప్పుడు అనిపించిందని అన్నాడు. ఆయనలా టెన్షన్ పడకుండా కూల్ గా .. ఫాస్టుగా సినిమా చేయడానికి ట్రై చేస్తున్నా తన వల్ల కావడం లేదని చెప్పాడు.
అందుకు పూరి నవ్వుతూ .. "ఇంతవరకూ చాలా ఫాస్టుగా సినిమాలు చేస్తూ వచ్చాను. ఇక ఇప్పుడు అంతగా పరిగెత్తవలసిన అవసరం లేదనిపిస్తోంది. సుకుమార్ మాదిరిగా సమయం తీసుకుని .. బలమైన కంటెంట్ తోనే సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చాను" అంటూ సమాధానమివ్వడం విశేషం.