విజయనగరంలో పన్ను కట్టలేదని గేటు ముందు చెత్త వేసిన మునిసిపల్ సిబ్బంది... వీడియో ఇదిగో
- ఏపీలో చెత్త పన్ను వసూలు చేస్తున్న మునిసిపల్ సిబ్బంది
- పన్ను కట్టని ఇంటి ముందు చెత్తను పారబోసిన మునిసిపల్ కార్మికులు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ఏపీలో చెత్త పన్ను వసూలుకు వైసీపీ సర్కారు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. చెత్త పన్ను వసూలుపై ఆదిలో విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా... జగన్ సర్కారు వెనక్కు తగ్గిన దాఖలా కనిపించలేదు. గతంలో చెత్త పన్ను వసూలు మొదలుపెట్టినప్పుడు... కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో చెత్త పన్ను కట్టని ఓ దుకాణం ముందు చెత్తను పారబోస్తూ మునిసిపల్ సిబ్బంది ఓ వినూత్న చర్యకు దిగిన సంగతి తెలిసిందే.
అలాంటి ఘటనే ఇప్పుడు విజయనగరంలో చోటుచేసుకుంది. కాకపోతే, కర్నూలులో వ్యాపార సముదాయం ముందు మునిసిపల్ సిబ్బంది చెత్త పారబోయగా... విజయనగరంలో మాత్రం ఏకంగా నివాస భవనం ముందే మునిసిపల్ సిబ్బంది చెత్తను పారబోశారు. సదరు భవనం యజమాని అడ్డుకున్నా వినకుండా, మునిసిపల్ సిబ్బంది... ఆయన కళ్లెదుటే ఆ భవనం ముందు చెత్తను పారబోశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.