హీరోయిన్ కోమలీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన 'శశివదనే' టీమ్
- 'శశివదనే' చిత్రంలో హీరోయిన్ గా కోమలీ ప్రసాద్
- నేడు కోమలి పుట్టినరోజు
- విషెస్ తెలిపిన చిత్రబృందం
- కోమలి చక్కని నటన కనబర్చిందన్న నిర్మాత అహితేజ బెల్లంకొండ
రక్షిత్ అట్లూరి హీరోగా తెరకెక్కుతున్న 'శశివదనే' చిత్రంలో యువ నటి కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా నటిస్తోంది. నేడు కోమలీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా 'శశివదనే' టీమ్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. లేటెస్ట్ స్టిల్ లో కోమలీ ప్రసాద్ చేతిలో పువ్వులతో చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకునేలా ఉంది. ఆమె ఫస్ట్ లుక్ కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది.
కాగా, 'శశివదనే' చిత్రానికి సాయిమోహన్ ఉబ్బన దర్శకుడు. ఏజీ ఫిల్మ్ కంపెనీ బ్యానర్ పై ఎస్వీఎస్ కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి అహితేజ బెల్లంకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ, తమ హీరోయిన్ కోమలీ ప్రసాద్ కు చిత్ర యూనిట్ సభ్యులందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రంలో కోమలీ ప్రసాద్ అద్భుతంగా నటించిందని కితాబు ఇచ్చారు. సెప్టెంబరు 1 నుంచి టాలీవుడ్ లో షూటింగులు మళ్లీ మొదలవుతున్నాయని, 'శశివదనే' చిత్రానికి మిగిలివున్న భాగాన్ని చిత్రీకరిస్తామని, మరో 10 రోజుల చిత్రీకరణ మిగిలి ఉందని నిర్మాత అహితేజ బెల్లంకొండ వివరించారు.
'పలాస 1978' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి శశివదనే చిత్రంలో చక్కని నటనా ప్రతిభ కనబర్చాడని కొనియాడారు. ఈ సినిమాను నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు వెల్లడించారు.