షూటింగ్ లో చిరంజీవికి కోపం తెప్పించిన వైష్ణవ్ తేజ్
- ఉప్పెనతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్
- శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో బాలనటుడిగా పరిచయం
- షూటింగ్ చేస్తుండగా నవ్విన వైనం
- సీరియస్ అయిన చిరంజీవి
మెగా ఇంటి నుంచి వచ్చిన హీరోల్లో వైష్ణవ్ తేజ్ ఒకరు. వైష్ణవ్ తేజ్ తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం ద్వారా బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. వైష్ణవ్ తేజ్ ఆ సినిమాలో ముఖంలో ఎలాంటి హావభావాలు లేకుండా, అచేతనంగా ఉండే బాలుడిగా కనిపిస్తాడు.
కాగా, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా వైష్ణవ్ తేజ్ పంచుకున్నాడు. ఆ సినిమాలో తన పాత్రకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని, కేవలం వీల్ చెయిర్ లో కూర్చుని ఉండడమేనని తెలిపాడు.
కానీ, ఓ సీన్ చేస్తుండగా బాగా నవ్వొచ్చిందని, దాంతో సెట్స్ మీద ఉన్న పెద్ద మామయ్య చిరంజీవి కోప్పడ్డాడని వెల్లడించాడు. ఆ సినిమాలో తాను పోషించిన పాత్ర అస్సలు కదలకూడదని, తాను నవ్వేసరికి మామయ్య సీరియస్ అయ్యాడని వివరించాడు. ఇక తమ కుటుంబ సభ్యులందరం ఏదైనా కార్యక్రమంలో కలిస్తే.. చిరంజీవి మామయ్య "ఒరేయ్" అని పిలిస్తే చాలు... అందరం పలుకుతామని తెలిపాడు.