యూట్యూబ్‌లో కాంగ్రెస్ ఛానెల్ మాయం... కారణాలను అన్వేషిస్తున్నామన్న కాంగ్రెస్
- ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరిట కాంగ్రెస్ యూట్యూబ్ ఛానెల్
- బుధవారం ఉన్నట్లుండి మాయమైన ఛానెల్
- యూట్యూబ్, గూగుల్‌లతో చర్చిస్తున్న పార్టీ సోషల్ మీడియా వింగ్
- త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటన
సోషల్ మీడియాలో వ్యక్తులకే కాకుండా పలు సంస్థలతో పాటు రాజకీయ పార్టీలకు అప్పుడప్పుడూ షాక్ తగులుతూనే ఉంది. ఉన్నట్లుండి ఆయా వ్యక్తులు, సంస్థల ఖాతాలు డిలీట్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో కాంగ్రెస్ పార్టీకి యూట్యూబ్‌లో షాక్ తగిలింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరిట యూట్యూబ్‌లో ఓ ఛానెల్‌ను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఛానెల్ బుధవారం ఉన్నట్లుండి మాయమైపోయింది.
అయితే వెనువెంటనే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ గుర్తించింది. ఆ మరుక్షణమే యూట్యూబ్‌తో పాటు దాని మాతృ సంస్థ గూగుల్‌ను సంప్రదించింది. ప్రస్తుతానికి అయితే ఏ కారణంతో తమ ఛానెల్ కనిపించడం లేదో తెలియదని పార్టీ సోషల్ మీడియా వింగ్ తెలిపింది. సాంకేతిక కారణమో, లేదంటే ఏదైనా కుట్ర కోణం ఉందో పరిశీలిస్తున్నామని వెల్లడించింది. త్వరలోనే తమ ఛానెల్‌ను పునరుద్ధరిస్తామని ప్రకటించింది.