వైఎస్సార్‌పై పాట పాడుతున్న బూచేపల్లి వెంకాయమ్మను వారించి.. తీసుకొచ్చి కూర్చోబెట్టిన జగన్... వీడియో ఇదిగో
- ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్
- చీమకుర్తి సభలో వైఎస్సార్‌పై పాట అందుకున్న బూచేపల్లి వెంకాయమ్మ
- జగన్ వారిస్తున్నా పాటను కంటిన్యూ చేసిన జడ్పీ చైర్మన్
- జగన్ తన కుర్చీలో నుంచి లేచి వెళ్లి వెంకయమ్మను తీసుకొచ్చిన వైనం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చీమకుర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికపై ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం జగన్ వేదికపై కూర్చుని ఉండగా... ప్రకాశం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న బూచేపల్లి వెంకాయమ్మ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఓ పాట అందుకున్నారు. జగన్ వారిస్తున్నా... ఆమె ఆ పాటను కొనసాగించారు.
ఈ క్రమంలో జగన్ సూచన మేరకు వెంకామయ్య కుమారుడు, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి ఆమె వద్దకెళ్లి ఆమె పాటను నిలిపే యత్నం చేశారు. అయినా కూడా ఆమె వినకుండా పాటను కొనసాగించడంతో ఉన్నట్టుండి కుర్చీలో నుంచి లేచిన జగన్... ఒక్కఉదుటున వెంకాయమ్మ వద్దకు వెళ్లారు. ఆమెను తన రెండు చేతులతో పట్టుకుని తీసుకొచ్చి, ఆమెకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. క్షణాల వ్యవధిలో జరిగిన సన్నివేశం వైరల్‌గా మారిపోయింది.