రేఖ మేడమ్ జీవితంలో అందమైన మిస్టరీ ఉండొచ్చు: కరణ్ జొహార్

  • రహస్యంగానే ఉంచాల్సిన అవసరం ఉందేమోనన్న కరణ్
  • తన షోకు ఆమెను రప్పించలేకపోయినట్టు వెల్లడి
  • తన స్నేహితుడు ఆదిత్య చోప్రా విషయంలోనూ అంతేనన్న నటుడు
కాఫీ విత్ కరణ్.. ఇది ఎంతో ప్రజాకర్షణ ఉన్న టీవీ షో. ఇప్పటికి ఏడు సీజన్లుగా సుదీర్ఘకాలంగా నడుస్తున్నది. ఈ షోకు ఒక్కసారైనా రావాలని సెలబ్రటీలు కోరుకుంటారనడంలో ఆశ్చర్యం లేదు. కానీ, ఈ షోకు దూరంగా ఉండేవారు కూడా ఉన్నారు. అది కరణ్ జొహార్ ద్వారానే తెలిసింది. ఎంతో ప్రయత్నించినా కానీ, కాఫీ విత్ కరణ్ షోకు తీసుకురాలేకపోయిన సెలబ్రిటీలు ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్నను ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా కరణ్ ఎదుర్కొన్నాడు. 

‘‘ఒక్కసారి రేఖ మేడమ్ విషయంలో అదే జరిగింది. ఆమెను తీసుకురావాలని ప్రయత్నించాను. షోలో ఆమెను కనిపించేలా చేయాలని నాకెంతో ఆసక్తి ఉండేది. కానీ, ఆమెను ఒప్పించలేకపోయాను. ఆమె జీవితంలో అందమైన మిస్టరీ ఏదో ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను. దాన్ని ఎప్పటికీ రక్షించాల్సిన అవసరం ఉండొచ్చు. కనుక ఆ తర్వాత నుంచి నేను ఆమెను ఒత్తిడి చేయలేదు’’ అని చెప్పాడు. అలాగే, తన స్నేహితుడు, మార్గదర్శి అయిన ఆదిత్య చోప్రాను కూడా తీసుకురాలేకపోయినట్టు తెలిపాడు.

కాఫీ విత్ కరణ్ షోలో భాగంగా అతిథుల వ్యక్తిగత, శృంగార జీవితానికి సంబంధించిన అంశాలను కరణ్ జొహార్ తవ్వి తీసే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో కొందరు ఈ షోకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు.


More Telugu News