ఏపీ దేవాదాయ శాఖ సలహాదారు శ్రీకాంత్ నియామకాన్ని నిలుపుదల చేసిన హైకోర్టు
- ఇటీవలే సలహాదారుగా శ్రీకాంత్ నియామకం
- నియామకం నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టులో పిటిషన్
- శ్రీకాంత్ నియామక ఉత్తర్వులపై స్టే విధించిన కోర్టు
ఏపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ సలహాదారుగా నియమితుడైన జె.శ్రీకాంత్ నియామకాన్ని నిలుపుదల చేస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దేవాదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్‌ను ఇటీవలే ఏపీ ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీనిని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దేవాదాయ శాఖ సలహాదారుగా శ్రీకాంత్ నియామకం నిబంధనలకు విరుద్ధమని వారు తమ పిటిషన్లలో హైకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్లపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పిటిషనర్ల వాదనలు సరైనవేనని భావించిన హైకోర్టు... శ్రీకాంత్ నియామక ఉత్తర్వులపై స్టే విధించింది.