'లైగర్' సినిమా ఎలా ఉంది?..  ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ

  • విజిల్స్ వేసే మాస్ ఎంటర్టయినర్ అన్న ఉమైర్ సంధూ
  • విజయ్ దేవరకొండ వన్ మేన్ షో చేశాడని ప్రశంస
  • స్టోరీ, స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉన్నాయని వ్యాఖ్య
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'లైగర్' సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తుండగా, ప్రపంచ హెవీ వెయిట్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్థాయిలో ఒక రేంజ్ కు వెళ్లిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు, బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు ట్విట్టర్ ద్వారా 'లైగర్' ఫస్ట్ రివ్యూను ఇచ్చారు. 'విజిల్స్ వేసే మాస్ ఎంటర్టయినర్ 'లైగర్'. విజయ్ దేవరకొండ వన్ మేన్ షో చేశాడు. షో మొత్తాన్ని ఆయన దోచేశాడు. టెర్రిఫిక్ యాక్షన్ స్టంట్స్. డైరెక్షన్ అదిరిపోయింది. ఈ సినిమాలో రమ్యకృష్ణది ఒక సర్ ప్రైజ్ ప్యాకేజ్. అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే మాత్రం యావరేజ్ గా ఉన్నాయి' అని ఉమైర్ సంధు తన రివ్యూను ఇచ్చారు.


More Telugu News