కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తనకు ఇస్తారంటూ వస్తున్న వార్తలను ఖండించిన రాజస్థాన్ సీఎం గెహ్లాట్
- పార్టీ హైకమాండ్ తనకు కొన్ని బాధ్యతలు అప్పగించిందన్న గెహ్లాట్
- తన బాధ్యతల విషయంలో రాజీపడబోనని వ్యాఖ్య
- ఈ వార్తలు మీడియా ద్వారానే వింటున్నానని స్పష్టీకరణ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తనకు అప్పగించే విషయం తెలియదని రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ తనకు బాధ్యతలు అప్పగించబోతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.
‘‘దీన్ని నేను మీడియా ద్వారానే వింటున్నాను. దీని గురించి నాకు ఏమీ తెలియదు. నాకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తున్నాను. హైకమాండ్ నాకు పని అప్పగించింది. రానున్న ఎన్నికలకు గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పరిశీలకుడిగా ఉన్నాను. రాజస్థాన్ లో నాకున్న బాధ్యతల విషయంలోనూ రాజీపడను. మిగిలిన వార్తలను నేను మీడియా నుంచే వింటున్నా’’ అని అశోక్ గెహ్లాట్ చెప్పారు.
గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు కావడంతో అశోక్ గెహ్లాట్ కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోనియాకు వయసు మీద పడిపోవడం, రాహుల్ అధ్యక్ష బాధ్యతలకు విముఖంగా ఉండడంతో ప్రత్యామ్నాయం కోసం పార్టీ వెతుకుతోంది.