దేశంలో కొత్తగా పది వేలకు పైగా కరోనా కేసులు
- గత 24 గంటల్లో 10,649 కేసుల నమోదు
- వైరస్ వల్ల తాజాగా 36 మంది మృతి
- ప్రస్తుతం దేశంలో 96,442 క్రియాశీల కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 4,07,096 మందికి పరీక్షల చేయగా.. 10,649 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. మొన్నటితో పోలిస్తే రెండు వేల పైచిలుకు కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 96,442 క్రియాశీల కేసులు ఉన్నాయి. క్రియాశీల కేసుల రేటు 0.22 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటి రేటు 2.62 శాతంగా నమోదైంది. వారపు పాజిటివిటీ రేటు 3.32 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.
గత 24 గంటల్లో 10,677 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో, దేశంలో ఇప్పటిదాకా వైరస్ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,37,44,301కి పెరిగింది. ప్రస్తుత రికవరీ రేటు 98.59 శాతంగా నమోదైంది. వైరస్ వల్ల గత 24 గంటల్లో 36 మంది మరణించారు. దాంతో దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 5,27,452కి చేరుకుంది. ఇక, దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 210.58 కోట్ల డోసులు అందజేశారు. ఇందులో 94.05 కోట్ల రెండో డోసులు ఉండగా, 14.30 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ఉన్నాయి.