విద్యుత్ వినియోగదారులపై పడిన సైబర్ నేరగాళ్లు.. సరఫరా నిలిపివేస్తున్నామంటూ మెసేజ్‌లు

  • గత నెల బిల్లు చెల్లించలేదంటూ మెసేజ్‌లు
  • రాత్రి 9.30 గంటలకు కరెంటు నిలిపివేస్తున్నామంటూ వల
  • ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీకి కూడా మెసేజ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రభాకర్‌రావు
  • ఇలాంటి మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
సైబర్ నేరగాళ్లు ఇప్పుడు రూటు మార్చి విద్యుత్ వినియోగదారులపై పడ్డారు. గత నెల బిల్లు చెల్లించనందుకు ఈ రోజు రాత్రి 9.30 గంటలకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నామని, పునరుద్ధరించాలంటే ఈ నెంబరుకు కాల్ చేయాలంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఈ మెసేజ్‌లు చూసి విద్యుత్ వినియోగదారులు షాకవుతున్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు కూడా ఇలాంటి మెసేజే రావడంతో ఆయన విస్తుపోయారు.

తనకొచ్చిన మెసేజ్ చూసి షాకైన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇలాంటి ఫిర్యాదులే పదుల సంఖ్యలో వచ్చినట్టు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. ఈ మెసేజ్‌లు చూస్తున్నవారు నిజమనేనని నమ్మి సైబర్ నేరగాళ్లకు ఫోన్లు చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ అధికారులు కోరారు.


More Telugu News