ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: జింబాబ్వేపై గెలుపుతో టీమిండియా స్థానం పదిలం
- జింబాబ్వేతో ముగిసిన 3 వన్డేల సిరీస్
- 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
- టీమిండియాకు పెరిగిన 3 రేటింగ్ పాయింట్లు
- మొత్తం 111 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్న భారత్
కేఎల్ రాహుల్ నాయకత్వంలోని భారత జట్టు జింబాబ్వేపై 3-0తో వన్డే సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తన మూడో స్థానాన్ని భారత్ పదిలం చేసుకుంది. జింబాబ్వేతో సిరీస్ కు ముందు టీమిండియా ఖాతాలో 108 రేటింగ్ పాయింట్లు ఉండగా, సిరీస్ ముగిసిన అనంతరం మరో 3 పాయింట్లు పెరిగి, ప్రస్తుతం జట్టు ఖాతాలో 111 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో 124 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్ (119) జట్టు రెండోస్థానంలో నిలిచింది. పాకిస్థాన్ జట్టు 107 రేటింగ్ పాయింట్లతో నాలుగోస్థానంలో ఉంది.