ఏపీలో డీఎస్సీ లిమిటెడ్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌... 502 ఉపాధ్యాయ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న ప్ర‌భుత్వం

  • నేటి నుంచే ఫీజు చెల్లింపున‌కు అవ‌కాశం
  • ఈ నెల 25 నుంచి సెప్టెంబ‌ర్ 18 దాకా ద‌ర‌ఖాస్తుల‌కు అవ‌కాశం
  • అక్టోబ‌ర్ 23న రాత ప‌రీక్ష‌, న‌వంబ‌ర్ 4న ఫ‌లితాలు
ఏపీలో స్వ‌ల్ప సంఖ్య‌లో ఉపాధ్యాయుల పోస్టుల భ‌ర్తీకి జ‌గ‌న్ స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. సీఎం జ‌గ‌న్ అనుమ‌తితో రాష్ట్ర పాఠ‌శాల విద్యా శాఖ లిమిటెడ్ డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. వాస్త‌వానికి డీఎస్సీ ఎప్పుడు విడుద‌లైనా వేల కొల‌ది ఉపాధ్యాయుల పోస్టులు భ‌ర్తీ అవుతూ ఉంటాయి. అయితే ఏపీ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన లిమిటెడ్ డీఎస్సీ నోటిఫికేష‌న్‌లో కేవ‌లం 502 ఉపాధ్యాయ పోస్టులు మాత్ర‌మే భ‌ర్తీ కానున్నాయి. 

జిల్లా ప‌రిష‌త్‌, మండ‌ల ప‌రిష‌త్ పాఠశాల‌ల్లో 199 పోస్టులు, మోడ‌ల్ స్కూళ్ల‌లో 207 పోస్టులు, మునిసిప‌ల్ స్కూళ్ల‌లో 15 పోస్టులు, స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ విభాగంలో 81 పోస్టులు... ఈ లిమిటెడ్ డీఎస్సీలో భ‌ర్తీ కానున్నాయి. ఈ నోటిఫికేష‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఫీజు చెల్లింపున‌కు మంగ‌ళ‌వారం (ఆగ‌స్టు 23) నుంచి సెప్టెంబ‌ర్ 17 వ‌ర‌కు గ‌డువు ఉంది. ఆ త‌ర్వాత ఈ నెల 25 నుంచి సెప్టెంబ‌ర్ 18 వ‌రకు ద‌ర‌ఖాస్తుల‌కు అనుమ‌తి ఉంది. అక్టోబ‌ర్ 23న రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న పాఠ‌శాల విద్యాశాఖ నవంబ‌ర్ 4న ఫ‌లితాలు వెల్ల‌డిస్తుంది. ఈ డీఎస్సీలో టెట్ అభ్య‌ర్థుల‌కు 20 శాతం వెయిటేజీ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది.


More Telugu News