ఎన్డీటీవీ మీడియా సంస్థపై కన్నేసిన అదానీ... 26 శాతం వాటా కోసం భారీ ఆఫర్
- మీడియా రంగంలో ఎదిగేందుకు అదానీ ప్రయత్నాలు
- గత మార్చిలో తొలి అడుగు
- క్వింటిల్లియన్ లో మైనారిటీ వాటా సొంతం
- తాజాగా ఎన్డీటీవీకి ఓపెన్ ఆఫర్
ఎన్డీటీవీ (న్యూఢిల్లీ టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్) జాతీయస్థాయిలో ప్రముఖ మీడియా సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పుడీ మీడియా సంస్థపై భారత సంపన్నుడు అదానీ కన్నేశారు. ఎన్డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలుకు అదానీ గ్రూప్ తాజాగా ప్రతిపాదన చేసింది. 1,67,62,530 షేర్లను ఒక్కొక్కటి రూ.294 ముఖ విలువతో మొత్తం రూ.492 కోట్లకు కొనుగోలు చేసేందుకు విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ ఈమేరకు ఎన్డీటీవీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చాయి.
కాగా, విశ్వప్రధాన్ కమర్షియల్ ను తన సబ్సిడరీ సంస్థ ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ లిమిటెడ్ తో రూ.113.75 కోట్లతో కొనుగోలు చేయించినట్టు అదానీ ఎంటర్ ప్రైజెస్ తన ఎక్చేంజి ఫైలింగ్ లో పేర్కొంది. అటు, అదానీ గ్రూప్ నుంచి అందిన ఓపెన్ ఆఫర్ ప్రతిని ఎన్డీటీవీ స్టాక్ ఎక్చేంజీలకు సమర్పించింది.
అదానీ గ్రూప్ గత మార్చిలో స్థానిక డిజిటల్ బిజినెస్ న్యూప్ ప్లాట్ ఫామ్ క్వింటిల్లియన్ లోనూ మైనారిటీ వాటా చేజిక్కించుకుంది. భారత మీడియా రంగంలోకి అదానీ తొలి అడుగు ఇదే. ఇప్పుడు ఎన్డీటీవీలోనూ వాటాలు చేజిక్కించుకోవడం ద్వారా జాతీయ మీడియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ప్రస్థానం సాగిస్తున్నారు.