ఎమ్మెల్యే రాజాసింగ్ ను సస్పెండ్ చేసిన బీజేపీ హైకమాండ్

  • మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల ఫలితం
  • రాజా సింగ్ పై వేటు వేసిన బీజేపీ
  • శాసనసభాపక్ష నేత పదవి నుంచి కూడా తొలగింపు
  • షోకాజ్ నోటీసుల జారీ.. సెప్టెంబరు 2 వరకు గడువు
ఇటీవల నుపుర్ శర్మ వ్యవహారం తెరమరుగు కాకముందే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై బీజేపీ అధినాయకత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అటు, శాసనసభాపక్ష నేత పదవి నుంచి కూడా తొలగించింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబరు 2 లోపు వివరణ ఇవ్వాలంటూ రాజాసింగ్ కు బీజేపీ హైకమాండ్ పది రోజుల సమయం ఇచ్చింది. 

కాగా, రాజాసింగ్ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. రాజాసింగ్ వీడియోపై మైనారిటీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, వివాదాస్పదమైన ఆ వీడియోను పోలీసులు యూట్యూబ్ నుంచి తొలగించారు.


More Telugu News