హీరోగా నిలబడటానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నా: నాగచైతన్య
- బాలీవుడ్ కంటే టాలీవుడ్ లో నెపోటిజం తక్కువేనన్న చైతూ
- తాత, నాన్న వారసుడిగా ఇండస్ట్రీలోకి ఈజీగా ప్రవేశించానని వెల్లడి
- సెల్ఫ్ మేడ్ హీరో సినిమాకు నా కంటే ఎక్కువ వసూళ్లు వస్తే నిర్మాతలు ఆయన వద్దకే వెళ్తారని వ్యాఖ్య
సినీ పరిశ్రమలోని నెపోటిజం (బంధుప్రీతి)పై యువ హీరో అక్కినేని నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో నెపోటింజంపై నాగచైతన్యకు ఓ ప్రశ్న ఎదురైంది. ఇండస్ట్రీలో నెలకొన్న వారసత్వంపై మీ అభిప్రాయం ఏమిటనే ప్రశ్నకు బదులుగా... బాలీవుడ్ తో పోలిస్తే టాలీవుడ్ లో నెపోటిజం తక్కువనే చెప్పొచ్చని చైతూ అన్నాడు. తన తాత, తన తండ్రి ఇద్దరూ నటులేనని... వారి వారసుడిగా ఇండస్ట్రీలోకి చాలా ఈజీగా ప్రవేశించానని... కానీ, హీరోగా నిలదొక్కుకోవడానికి తాను ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నానని చెప్పాడు.
ఒకవేళ తన సినిమా, మరో సెల్ఫ్ మేడ్ హీరో సినిమా ఒకే రోజు విడుదలై... తన సినిమాకు రూ. 10 కోట్లు మాత్రమే వచ్చి, ఆ సెల్ఫ్ మేడ్ హీరో సినిమాకు రూ. 100 కోట్ల వసూళ్లు వస్తే... రూ. 100 కోట్లు సాధించిన ఆ హీరో వద్దకే ప్రతి నిర్మాత వెళ్తాడని చైతూ తెలిపాడు. రేపు ఆ సెల్ఫ్ మేడ్ హీరో వారసులు ఇండస్ట్రీలోకి వస్తామంటే... వద్దని అడ్డు చెప్పగలమా? అని ఆయన ప్రశ్నించారు.