బీజేపీ నేతలపై 33 జిల్లా కోర్టుల్లో పరువునష్టం దావా వేసిన కవిత

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత హస్తం ఉందన్న బీజేపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే   
  • తన తండ్రిని బద్నాం చేయడానికి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న కవిత
  • వీరిద్దరిపై పరువునష్టం దావా వేసిన వైనం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఊపేస్తోంది. ఈ స్కామ్ దెబ్బకు నిన్నటి వరకు ఎంతో హీట్ పుట్టించిన మునుగోడు ఉప ఎన్నికల అంశం కూడా పక్కకు వెళ్లిపోయింది. పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందార్ సింగ్.. కేసీఆర్ కుటుంబంపై చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఈ ఆరోపణలపై కవిత సీరియస్ అయ్యారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న తన తండ్రి కేసీఆర్ ను బద్నాం చేయడానికే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వీరిపై పరువునష్టం దావా వేస్తానని నిన్న ప్రకటించారు. చెప్పిన విధంగానే వీరిపై ఆమె పరువునష్టం దావా వేశారు. తెలంగాణలోని 33 జిల్లా కోర్టులలో ఆమె పరువునష్టం దావా వేశారు. మరోవైపు నిన్న కవిత ఇంటి వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టిన 29 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ నరేందర్ తెలిపారు.


More Telugu News