శాలరీ అకౌంట్ కస్టమర్లకు పీఎన్ బీ ప్రత్యేక క్రెడిట్ కార్డ్
- క్రెడిట్ కార్డుతోపాటు ఉచితంగా ఇన్సూరెన్స్
- డిపాజిట్లపై ఓవర్ డ్రాప్ట్ సదుపాయం
- ఆన్ లైన్ లో రుణాలు తీసుకుంటే పావు శాతం వడ్డీ రాయితీ
ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ) తన కస్టమర్ల కోసం పలు ప్రయోజనాలతో కూడిన క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. శాలరీ అకౌంట్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ నూతన క్రెడిట్ కార్డును ప్రకటించింది. ఈ కార్డుతో పాటు ఉచిత బీమా కవరేజీని కూడా బ్యాంకు ఆఫర్ చేస్తోంది. మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి నూతన క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పీఎన్ బీ తెలిపింది. రూపే, వీసా రెండు ప్లాట్ ఫామ్ లపై ఈ క్రెడిట్ కార్డును పీఎన్ బీ ఆఫర్ చేస్తోంది.
అలాగే, డిపాజిట్ పై ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కూడా తీసుకొచ్చింది. బ్యాంకులో డిపాజిట్ చేసిన వారు.. దానిపై కావాల్సినప్పుడు నిధులు పొందడమే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం. కస్టమర్లు బ్యాంకు శాఖ వరకు రావాల్సిన అవసరం లేదని, ఆన్ లైన్ లోనే రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పీఎన్ బీ తెలిపింది. ఆన్ లైన్ మాధ్యమాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే వడ్డీ రేటులో 0.25 శాతం రాయితీ కూడా ఇస్తున్నట్టు ప్రకటించింది.