ఎయిర్ టెల్ 5జీ సేవలు తొలుత ప్రీమియం కస్టమర్లకే!

  • అధిక చార్జీలతో కూడిన ప్లాన్లకు ముందుగా అందించే యోచన
  • ఎయిర్ టెల్ ప్రమోటర్ భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్ వెల్లడి
  • తమకు తెలియకుండానే అధికంగా వినియోగిస్తారన్న అభిప్రాయం
అతి త్వరలో 5జీ సేవలను ప్రారంభించనున్న ఎయిర్ టెల్ వినియోగదారులకు షాక్ ఇచ్చేలా ఉంది. ధరల విషయంలో అనుకోకండి. 5జీ సేవల కోసం కస్టమర్ల నుంచి ప్రీమియం చార్జీలు విధించబోవడం లేదని భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్ అఖిల్ గుప్తా అన్నారు. కాకపోతే 5జీ సేవలను తొలుత అధిక ధరలతో కూడిన ప్లాన్లకే పరిమితం చేయవచ్చన్నారు.

అంటే ఒక విధంగా దిగువ స్థాయి, బడ్జెట్ ప్లాన్లకు 5జీ సేవలను తొలుత అందించే ఉద్దేశ్యం లేదని గుప్తా చెప్పినట్టయింది. 5జీ సేవలకు ప్రీమియం చార్జీలు విధించడం వేరు. ప్రీమియం ప్లాన్లకు 5జీ సేవలను పరిమితం చేయడం వేరు. సూక్ష్మంగా చూస్తే ఇందులో ఏదైనా 5జీ సేవల రూపంలో కంపెనీ అధిక ఆదాయం కోరుకుంటుందని తెలుస్తుంది.

ఓ సంస్థతో గుప్తా మాట్లాడుతూ.. ‘‘నా అభిప్రాయం ప్రకారం.. 5జీ వినియోగం అన్నది చాలా వేగంగా పెరుగుతుంది. 5జీ హ్యాండ్ సెట్ కలిగిన వారు 5జీ సేవలను పొందగలరు. తమకు తెలియకుండానే వారు ఎక్కువ డేటాను వినియోగించడం వల్ల అధిక టారిఫ్ ప్లాన్ లోకి వెళ్లిపోతారు. ఇది అధిక ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది’’ అని అఖిల్ గుప్తా తెలిపారు.


More Telugu News