భారత్ లో తయారయ్యే ఫోన్ల ధరలకు రెక్కలు!

  • ఫోన్ డిస్ ప్లే దిగుమతులపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ
  • విడిభాగాలతో కలిపి దిగుమతి చేసుకుంటే 15 శాతం అమలు
  • దీనివల్ల పెరగనున్న తయారీ వ్యయాలు
  • ఆ మేరకు కస్టమర్లకు ధరల పెంపు రూపంలో బదిలీ
భారత్ లో తయారవుతున్న స్మార్ట్ ఫోన్ల ధరలు మరికాస్త భారం కానున్నాయి. మొబైల్ ఫోన్లలో వినియోగించే విడిభాగాలకు మరింత కస్టమ్ డ్యూటీ చార్జీలు వర్తిస్తాయని పరోక్ష పన్నుల మండలి స్పష్టం చేసింది. ఫోన్ల విడిభాగాలపై అధిక కస్టమ్స్ సుంకంతో తయారీ వ్యయం పెరిగిపోతుంది. దీన్ని ఓఈఎంలు ధరల పెంపు రూపంలో కస్టమర్లకు బదిలీ చేస్తుంటాయి. 

డిస్ ప్లే అసెంబ్లీలపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విధించింది. ఒకవేళ యాంటెన్నా పిన్, పవర్ కీలు, ఇతర విడిభాగాలను డిస్ ప్లే అసెంబ్లీతోపాటు దిగుమతి చేసుకుంటే అప్పుడు 15 శాతం కస్టమ్స్ డ్యూటీ పడుతుందని తెలిపింది.

సిమ్ ట్రే, యాంటెన్నా పిన్, స్పీకర్ నెట్, పవర్ కీ, స్లైడర్ స్విచ్, బ్యాటరీ కాంపార్ట్ మెంట్, ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్స్ ఇలాంటి విడిభాగాలను డిస్ ప్లేతో అసెంబుల్ చేసి దిగుమతి చేసుకుంటే 15 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అమలవుతుందని పేర్కొంది.


More Telugu News