ద్రవిడ్ కు కరోనా పాజిటివ్.. ఆసియా కప్ కు అనుమానమే!

  • జింబాబ్వే టూర్ కు సైతం దూరంగా ఉన్న ద్రవిడ్
  • కోచ్ గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్
  • యూఏఈకి ఆలస్యంగా వెళ్లే అవకాశాలు
ఆసియా కప్ 2022కు ముందు భారత క్రికెట్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కరోనా వైరస్ సోకింది. జింబాబ్వే పర్యటనకు సైతం రాహుల్ ద్రవిడ్ కోచ్ గా వ్యవహరించని విషయం తెలిసిందే. ఆయనకు బదులు నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ చీఫ్ కోచ్ గా జింబాబ్వే పర్యటనకు వెళ్లాడు. 

మరోపక్క, యూఏఈ వేదికగా ఆసియాకప్ జరగనుండడం తెలిసిందే. ఆగస్ట్ 28న భారత్ -పాకిస్థాన్ జట్లు తొలిగా తలపడనున్నాయి. భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. అయితే, రాహుల్ ద్రవిడ్ స్థానంలో హెచ్ కోచ్ గా బీసీసీఐ మరొకరిని పంపిస్తుందా..? అన్నది చూడాలి. లేదంటే కొన్ని రోజుల విరామం తర్వాత ద్రవిడ్ యూఏఐకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. 

వెన్నునొప్పి కారణంగా ఆసియా కప్ కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. హర్షల్ పటేల్ కూడా దూరంగా ఉండనున్నాడు. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.


More Telugu News