సర్వే చేయించా... ప్రజల మొగ్గు టీడీపీ వైపే!: ఎంపీ రఘురామకృష్ణరాజు
- ఓ యాప్ ద్వారా సర్వే చేయించానన్న రఘురామ
- టీడీపీకి 90కి పైగా స్థానాలు వస్తాయని వెల్లడి
- జాతీయ సర్వేలు చూసి మోసపోవద్దని వైసీపీకి హితవు
- గోదావరి జిల్లాల్లో పవన్ గాలి వీస్తోందన్న వైసీపీ రెబల్ ఎంపీ
ఏపీ అసెంబ్లీకి 2024లో ఎన్నికలు జరగనుండగా, ఇటీవల పోల్స్ సందడి పెరిగింది. తాజాగా, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్రంలో పరిస్థితులపై సొంతంగా సర్వే చేయించానని పేర్కొన్నారు. తన సర్వేలో ప్రజల మొగ్గు టీడీపీ వైపేనని తెలిపారు. టీడీపీకి 90కి పైగా స్థానాలు లభించే అవకాశం ఉందని తెలిపారు.
జాతీయ మీడియాలో వచ్చిన సర్వేలు చూసి నిజమని నమ్మరాదని వైసీపీకి హితవు పలికారు. గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ హవా కనిపిస్తోందని రఘురామ పేర్కొన్నారు. ఈ మేరకు తాను ఓ యాప్ ద్వారా సర్వే చేయించానని వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పట్ల ప్రజలు సానుకూలంగా ఉంటారన్నది సర్వే ద్వారా స్పష్టమవుతోందని వివరించారు.