కోహ్లీ మూడేళ్లుగా సెంచరీ సాధించలేకపోవడంపై షాహిద్ అఫ్రిదీ స్పందన

  • 2019 నుంచి పేలవ ఫామ్ లో ఉన్న కోహ్లీ
  • చివరిసారిగా బంగ్లాదేశ్ పై సెంచరీ
  • కోహ్లీ ఫామ్ పై అఫ్రిదీని ప్రశ్నించిన అభిమాని
  • హుందాగా సమాధానమిచ్చిన అఫ్రిది
పాకిస్థాన్ దిగ్గజ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ ట్విట్టర్ లో తన అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించాడు. భారత క్రికెట్ గురించి, భారత క్రికెటర్ల గురించి అభిమానులు అఫ్రిదీని అనేక ప్రశ్నలు అడిగారు. గత 1000 రోజులుగా కోహ్లీ అంతర్జాతీయ స్థాయిలో ఒక్క సెంచరీ కూడా చేయకపోవడంపై మీరేమంటారు? అని ఓ అభిమాని అఫ్రిదీ స్పందన కోరాడు.

అందుకు అఫ్రిదీ బదులిస్తూ, "పెద్ద ఆటగాళ్ల సత్తా ఏంటన్నది వారు కష్టకాలంలో ఉన్నప్పుడే బయటపడుతుంది" అంటూ ట్వీట్ చేశాడు. అఫ్రిది స్పందన పట్ల నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. భారత్ అన్నా, భారత క్రికెటర్లన్నా వ్యతిరేక అభిప్రాయాలను కలిగివుండే అఫ్రిది నుంచి ఇలాంటి స్పందన వస్తుందని వారు ఏమాత్రం ఊహించలేదు. 

కాగా, గత మూడేళ్లుగా పేలవ ఆటతీరుతో నెట్టుకొస్తున్న కోహ్లీ చివరిసారిగా 2019లో బంగ్లాదేశ్ తో కోల్ కతాలో జరిగిన డే/నైట్ టెస్టులో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత పలు అర్ధసెంచరీలు సాధించినా, వాటిని శతకాలుగా మలచలేకపోయాడు.
.


More Telugu News