అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం భవిష్యత్ రాజకీయ మార్పులకు నాంది పలుకుతుంది: విష్ణువర్ధన్ రెడ్డి

  • అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఆహ్వానించదగ్గ పరిణామమన్న విష్ణు 
  • తారక్ లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ప్రశంస 
  • 2009 ఎన్నికల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించారని వ్యాఖ్య 
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగిన సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ సమావేశం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. భవిష్యత్ రాజకీయల్లో జరగబోయే పరిణామాలకు ఈ సమావేశం నాంది పలుకుతుందని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని అమిత్ షా ఎప్పుడూ కోరుకుంటారని చెప్పారు. 

జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో రాజకీయ చైతన్యం ఉందని, ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. 2009 ఎన్నికల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారాన్ని నిర్వహించారని చెప్పారు. అవినీతిపరులను బీజేపీ దగ్గరకు రానీయదని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తమకు సంబంధం లేదని ఏపీకి చెందిన కొందరు నేతలు వారంతట వారే ముందుకొచ్చి చెప్పుకుంటున్నారని తెలిపారు.


More Telugu News