వన్డేల్లో తొలి సెంచరీ సాధించిన శుభ్ మాన్ గిల్... జింబాబ్వేపై భారత్ భారీ స్కోరు
- హరారేలో మూడో వన్డే
- ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత్
- టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న వైనం
- నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు
- 130 పరుగులు చేసిన గిల్
జింబాబ్వేతో నామ మాత్రపు మూడో వన్డేలోనూ టీమిండియా జోరు కొనసాగించింది. యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ వన్డేల్లో తొలి సెంచరీ సాధించిన వేళ భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్ లో ధావన్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా దిగడంతో, గిల్ వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చాడు. అయినప్పటికీ, తన ఫామ్ కొనసాగిస్తూ పసికూనల్లాంటి జింబాబ్వే బౌలర్లను ఆటాడుకున్నాడు. 97 బంతుల్లో 130 పరుగులు చేసిన గిల్ 15 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. గిల్ ను బ్రాడ్ ఇవాన్స్ అవుట్ చేశాడు. దాంతో చివరి ఓవర్లలో భారత్ స్కోరు కాస్త మందగించింది.
అంతకుముందు ధావన్ 40, రాహుల్ 30 పరుగులు చేసి శుభారంభం అందించారు. వీరిద్దరినీ బ్రాడ్ ఇవాన్స్ అవుట్ చేశాడు. ఆ తర్వాత గిల్, ఇషాన్ కిషన్ (50) జోడీ జింబాబ్వే బౌలింగ్ ను ఉతికారేసింది. తొలి వికెట్ 63 పరుగుల వద్ద పతనం కాగా, రెండో వికెట్ 84 పరుగుల వద్ద పతనమైంది. గిల్, కిషన్ జోడీ విజృంభణతో భారత్ స్కోరు 200 మార్కు దాటింది. అనంతరం భారత్ తన మూడో వికెట్ 224 పరుగుల వద్ద కోల్పోయింది.
దీపక్ హుడా (1), సంజు శాంసన్ (15), అక్షర్ పటేల్ (1), శార్దూల్ ఠాకూర్ (9) నిరాశపరిచారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 5 వికెట్లు తీయడం విశేషం. విక్టర్ ఎన్యాచి 1, ల్యూక్ జాంగ్వే 1 వికెట్ తీశారు.