దేశంలో కొత్తగా 9531 కరోనా కేసులు
- ప్రస్తుతం దేశంలో 97,648 క్రియాశీల కేసులు
- వైరస్ వల్ల తాజాగా 36 మంది మృతి
- 24 గంటల్లో కోలుకున్న 11,726 మంది
దేశంలో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. గత 24 గంటల్లో 2,29,546 మందికి టెస్టులు చేయగా కొత్తగా 9531 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే 2231 కేసులు తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 97,648 క్రియాశీల కేసులు ఉన్నాయి. కొత్తగా వచ్చిన కేసుల్లో 942 ఢిల్లీలోనే నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉంది. ఓవరాల్ గా రోజువారీ పాజిటివిటీ రేటు 4.15 శాతంగా ఉంది. కరోనా వైరస్ వల్ల తాజాగా 36 మంది మృతి చెందారు. దాంతో, దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,27,368కి చేరుకుంది.
గత 24 గంటల్లో 11,726 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దాంతో, దేశంలో ఇప్పటిదాకా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,37,23,944కి చేరుకుంది. రికవరీ రేటు 98.59గా ఉంది. క్రియాశీల రేటు 0.23 శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 210,02,40,361 కరోనా వ్యాక్సిన్ డోసులు అందజేశారు. నిన్న ఒక్క రోజే 35,33,466 మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.