బోస్టన్ లో భారతీయులు సంబరాలు ఎలా జరుపుకుంటున్నారో.. చూడండి..

  • నింగిలో విమానం తోడుగా దూసుకుపోయిన భారత పతాకం
  • వీడియోను షేర్ చేసిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా
  • దీన్ని చూసి ఎంతో సంతోషించినట్టు పోస్ట్
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబరాలను విదేశాల్లో స్థిరపడిన భారతీయులు సైతం ఘనంగా జరుపుకుంటున్నారు. అమెరికాలోని బోస్టన్ నగరంలోని ప్రవాస భారతీయులు వినూత్నంగా ఈ వేడుకలను నిర్వహించారు. ఆకాశంలో అమెరికా, భారత్ పతాకాలు ఎగరేస్తూ గౌరవాన్ని చాటుకున్నారు. ఈ వీడియో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు ఎంతగానో నచ్చింది. దీంతో ఆయన తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. వాస్తవానికి ఈ వీడియోను తొలుత నిర్మాత అశోక్ పండిట్ పోస్ట్ చేశారు. 

ఓ చిన్నపాటి విమానం అమెరికా, భారత్ పతాకాలను తీసుకెళుతున్నట్టుగా ఉంది. ‘‘నేను 1973లో బోస్టన్ లో కాలేజీ చదువు ఆరంభించినప్పుడు.. భారత జనాభా చాలా తక్కువగా ఉండేది. ఒకే ఒక భారత రెస్టారెంట్ ఉండేది. భారత్ లో పులులు, పాముల గురించి సహచర విద్యార్థులు అడిగేవారు. ఈ గర్వకారణమైన సన్నివేశాన్ని చూసి నేను ఎంతగానో ఆనందించాను’’అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.


More Telugu News