పుట్టిన రోజున మెగాస్టార్ చిరుకు శుభాకాంక్షల వెల్లువ
- విషెస్ చెప్పిన గవర్నర్ తమిళిసై, చంద్రబాబు
- ‘హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి’ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్
- చిరు ఎమోషన్స్, జర్నీకి కనెక్ట్ అయ్యానన్న విజయ్ దేవరకొండ
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకుకు విషెస్ చెబుతున్నారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చిరు తమ్ముడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు.
గవర్నర్ సౌందర రాజన్ చిరుకు శుభాకాంక్షలు చెబుతూ.. ‘మెగాస్టార్ చిరంజీవి గారు తన తండ్రి కీర్తి శేషులు కొణిదెల వెంకట్ రావు గారి పేరుపై సినీ కార్మికుల కోసం ఒక ఆసుపత్రి నిర్మించాలని సంకల్పించడం అభినందనీయం. తన వచ్చే పుట్టినరోజు నాటికి ఈ ఆసుపత్రి ప్రారంభించాలని సంకల్పించడం స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు.
మెగాస్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో స్థిరపడిన నటుడని చంద్రబాబు కొనియాడారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా రోగులకు అందిస్తున్న సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు. నిండు నూరేళ్లూ ఆనంద, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని తెలిపారు.
‘నేను ప్రేమించే, గౌరవించే, ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తిని కోరుకుంటున్నాను’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. చిరుకు బర్త్ డే విషెస్ చెప్పాలని అందరినీ కోరారు. ‘మనసున్న మారాజు అన్నయ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని జనసేన పార్టీ ట్వీట్ చేసింది.
చిరుకు విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండ.. ఆయనతో చేసిన ప్రతి సంభాషణను ఆస్వాదించానని చెప్పాడు. చిరు ఎమోషన్స్, ఆయన జర్నీకి కనెక్ట్ అయ్యానని తెలిపాడు. ఒక వ్యక్తిగా ఆయన పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందని ట్వీట్ చేశాడు. ‘ఎలా ఎదగాలి, ఎదిగాక ఎలా ఉండాలి.. అంటే ఆయన జీవితం చదవాలి’ అంటూ రచయిత బీఎస్ రవి ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం ‘హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి’ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.