నారా లోకేశ్‌ను తోసేసిన పోలీసు అధికారి... ఫొటో ఇదిగో
- ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన లోకేశ్
- మార్గమధ్యలోనే లోకేశ్‌ను అడ్డుకున్న పోలీసులు
- పోలీస్ వ్యాన్‌లో విశాఖ తరలించిన వైనం
- లోకేశ్‌ను తోసేస్తున్న ఫొటోను పోస్ట్ చేసిన బీద రవిచంద్ర
ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్‌ను ఏపీ పోలీసులు అడుగడుగునా అడ్డగించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు ఆదివారం బయలుదేరిన నారా లోకేశ్‌ను అమదాలవలస మండలం కొత్త రోడ్డు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల నేపథ్యంలో పలాస పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు లోకేశ్‌కు తెలిపారు. తానేమీ ఉగ్రవాదిని, నక్సలైట్‌ను కాదని తెలిపిన లోకేశ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఈ సందర్భంగా లోకేశ్ వాదనను వినిపించుకోని పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనం ఎక్కించారు. ఈ సందర్భంగా తమతో వాగ్వాదానికి దిగిన లోకేశ్‌ను ఓ పోలీసు అధికారి రెండు చేతులతో పట్టుకుని తోసేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైసీపీ పాలనలో టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలు బ్రిటిష్ రౌలట్ చట్టాన్ని మరిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు.