కేసీఆర్ పాలనను అంతమొందించడానికి ఇది ప్రారంభం: అమిత్ షా
- కేసీఆర్ కుటుంబ పాలన వల్ల తెలంగాణ నష్టపోతోందన్న అమిత్ షా
- కేసీఆర్ పాలనను పడగొట్టేందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వచ్చారని వ్యాఖ్య
- కేసీఆర్ దళితులను మోసం చేశారని మండిపాటు
బీజేపీ అధికారంలోకి వస్తే దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అబద్ధం చెప్పారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించినప్పటికీ... కేసీఆర్ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదని అన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్... దళితులను మోసం చేశారని మండిపడ్డారు. జిల్లాకో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిని నిర్మాస్తామని కేసీఆర్ చెప్పారని... నల్గొండకు సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి వచ్చిందా అని ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామన్నారు... అందరికీ వచ్చాయా? అని అడిగారు. గిరిజనులకు భూములు ఇస్తామని కేసీఆర్ చెప్పారని... ఒక్క ఎకరా అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పారు.