మెరిట్ ఆధారంగా బీసీసీఐ సెక్రటరీగా ఎదిగిన ఓ కుమారుడి తండ్రి తెలంగాణ పర్యటనకు వచ్చారు: అమిత్ షాపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రం
- అమిత్ షా తెలంగాణ టూర్‌పై కేటీఆర్ సెటైర్లు
- రాజగోపాల్ రెడ్డిని సౌమ్యుడిగా పేర్కొంటూ ఎద్దేవా
- కుటుంబ పాలన రద్దుపై అమిత్ షా హితబోధ చేస్తున్నారంటూ విమర్శ
తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కుటుంబ పాలనపై అమిత్ షా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పూర్తిగా మెరిట్ ఆధారంగా ర్యాంకులను సాధించి బీసీసీఐ సెక్రెటరీగా ఎదిగిన ఓ కుమారుడి తండ్రి తెలంగాణ పర్యటనకు వచ్చారంటూ అమిత్ షాపై కేటీఆర్ సెటైర్లు సంధించారు.
అంతటితో ఆగని కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపైనా సెటైర్లు గుప్పించారు. రాజగోపాల్ రెడ్డిని సౌమ్యుడంటూ ఎద్దేవా చేశారు. సౌమ్యుడైన నేత కోసం ప్రచారం చేసేందుకు అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చారని చలోక్తి సంధించారు. అన్న ఎంపీగా ఉండగా, భార్య ఎమ్మెల్సీగా పోటీ చేసిన వ్యక్తి తరఫున అమిత్ షా ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి తండ్రి.. కుటుంబ పాలన రద్దు చేయాల్సిన అవసరంపై మనకు హితబోధ చేస్తున్నారంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.