ప్రత్యేక హెలికాప్టర్ లో మునుగోడుకు బయల్దేరిన అమిత్ షా
- హైదరాబాద్ నుంచి మునుగోడుకు బయల్దేరిన అమిత్ షా
- హైదరాబాద్ లో బీజీపీ దళిత కార్యకర్త ఇంటికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి
- మునుగోడులో ఏం మాట్లాడతారనే విషయంలో సర్వత్ర ఆసక్తి
కాసేపట్లో మునుగోడులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ ప్రారంభం కానుంది. కాసేపటి క్రితం ఆయన హైదరాబాద్ నుంచి మునుగోడుకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయల్దేరారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి వచ్చిన అమిత్ షాకు బేగంపేట్ ఎయిర్ పోర్టులో రాష్ట్ర బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నగరంలోని సాంబమూర్తినగర్ లో బీజేపీ దళిత కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్ళారు.
ఇప్పటికే మునుగోడు సభాప్రాంగణానికి బీజేపీ రాష్ట్ర కీలక నేతలందరూ చేరుకున్నారు. ఈ సభలో బీజేపీ కండువాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కప్పుకోనున్నారు. మునుగోడులో సీఆర్పీఎఫ్ అధికారులతో తొలుత అమిత్ షా భేటీ అవుతారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. మరోవైపు నిన్న మునుగోడులో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా ఎలా స్పందిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది.