నేనూ ఆర్గానిక్ వ్య‌వ‌సాయమే చేస్తున్నా!... తెలంగాణ రైతులతో అమిత్ షా ముచ్చ‌ట్లు!

  • బేగంపేట ఎయిర్‌పోర్టులో రైతుల‌తో అమిత్ షా భేటీ
  • విద్యుత్ చ‌ట్టం మార్చాల‌న్న రైతులు
  • చ‌ట్టం కాదు... ముందు ఇక్క‌డి ప్ర‌భుత్వాన్ని మార్చండ‌న్న కేంద్ర మంత్రి
  • 150 ఎక‌రాల్లో ఆర్గానిక్ సాగు చేస్తున్న‌ట్లు వెల్ల‌డి
మునుగోడులో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు హాజ‌ర‌య్యేందుకు హైద‌రాబాద్ వ‌చ్చిన బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... బేగంపేట ఎయిర్‌పోర్టులో తెలంగాణ‌కు చెందిన ప‌లువురు రైతులతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో వ్య‌వసాయం, ప్ర‌భుత్వాల నుంచి అందుతున్న సాయం త‌దిత‌రాల‌పై ఆయ‌న రైతుల‌ను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సంద‌ర్భంగా తాను కూడా ఆర్గానిక్ వ్య‌వ‌సాయ‌మే చేస్తున్నాన‌ని అమిత్ షా చెప్పారు. త‌న సొంత రాష్ట్రంలో 150 ఎక‌రాల్లో ఆర్గానిక్ ప‌ద్ద‌తిలో సాగు చేస్తున్నాన‌ని ఆయ‌న రైతుల‌కు తెలిపారు. అనంత‌రం వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్ల బిగింపున‌కు సంబంధించి రైతులు అమిత్ షా వ‌ద్ద ప్ర‌స్తావించారు. రైతుల‌కు కీడు చేసే ఈ చ‌ట్టాన్ని మార్చాల‌ని వారు ఆయ‌న‌ను కోరారు. రైతుల విన‌తికి స్పందించిన అమిత్ షా... మార్చాల్సింది చ‌ట్టం కాదు... ఇక్క‌డి ప్ర‌భుత్వాన్ని మార్చండి అంటూ స‌మాధానం ఇచ్చారు.


More Telugu News