మీ ఫోన్లో ఈ-సిమ్ ఉందా..? అదెలా పనిచేస్తుందంటే..
- ప్రచారానికి నోచుకుంటున్న ఈ-సిమ్
- ఫోన్ తయారీ సమయంలోనే ప్రవేశపెట్టే టెక్నాలజీ
- భౌతికంగా సిమ్ కార్డు అవసరం ఇక ఉండదు
- ప్రస్తుతం శామ్ సంగ్, యాపిల్, గూగుల్ ఫోన్లలోనే లభ్యం
ఈ-సిమ్ ఇప్పుడు ప్రచారంలోకి వస్తున్న అంశం. సిమ్ కార్డులకు తీవ్ర కొరత ఉందని, కనుక రూ.10,000 అంతకుమించి ఖరీదైన అన్ని ఫోన్లలో ఈ-సిమ్ ఆప్షన్ ఉండేలా ఆదేశించాలంటూ సెల్యులర్ ఆపరేటర్ల సంఘం (ఎయిర్ టెల్, వొడా ఐడియా, జియో) టెలికం శాఖను లేఖ ద్వారా ఇటీవలే కోరింది. దీనివల్ల ఫోన్ల తయారీ వ్యయం పెరిగిపోతుందని తయారీ కంపెనీలు చెబుతున్నాయి.
ఈ-సిమ్ అంటే..?
ఖరీదైన యాపిల్, శామ్ సంగ్, గూగుల్ ఫోన్లలో ఈ-సిమ్ ఆప్షన్ ఉంటోంది. ఈ-సిమ్ అంటే ఎలక్ట్రానిక్ సిమ్ అని కాదు. ఎంబెడెడ్ సిమ్. ఫోన్లోని మథర్ బోర్డుపై సిమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసి ఉంటుంది. స్మార్ట్ వాచీలు, డ్రోన్లలోనూ ఇదే టెక్నాలజీ ఉపయోగిస్తుంటారు. స్మార్ట్ వాచ్ లలో పెద్దగా స్థలం ఉండదు కనుక సిమ్ స్లాట్ తో పోలిస్తే, ఈ-సిమ్ వీటికి అనుకూలం. ఫోన్ తయారీ సమయంలోనే మథర్ బోర్డుపై ఏర్పాటు చేసిన డిజిటల్ సిమ్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఈ-సిమ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తున్నాయి.
యాక్టివేట్ చేసుకునేది ఎలా..?
యాక్టివేషన్ చాలా సులభంగా జరుగుతుంది. టెలికం ఆపరేటర్లు వీటి కోసం ప్రత్యేకంగా చార్జీలు తీసుకోవడం లేదు. ఎయిర్ టెల్, జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కనెక్షన్లకు ఈ-సిమ్ అందిస్తుంటే, వొడాఫోన్ ఐడియా కేవలం పోస్ట్ పెయిడ్ కే పరిమితం చేసింది. యాక్టివేట్ చేసుకోవాలని అనుకుంటే.. ఎయిర్ టెల్ యూజర్లు ‘eSIM స్పేస్ ఇచ్చి రిజిస్టర్డ్ ఈ మెయిల్ టైప్ చేసి’ 121కు పంపించాలి. అదే వొడాఫోన్ ఐడియా కస్టమర్లు ‘eSIM స్పేస్ ఇచ్చి రిజిస్టర్డ్ ఈ మెయిల్ టైప్ చేసి’ 199కు పంపాలి. జియో అయితే. ‘eSIM స్పేస్ ఇచ్చి రిజిస్టర్డ్ ఈ మెయిల్ టైప్ చేసి’ 199కు పంపించాలి.
ఎస్ఎంఎస్ పంపిన తర్వాత యూజర్ల మెయిల్ ఐడీకి క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేసిన తర్వాత ఈ సిమ్ యాక్టివేట్ అవుతుంది. అందుకే ఈ మెయిల్ ఐడీని ఎస్ఎంఎస్ పంపడానికి ముందు ఒకటి రెండు సార్లు సరిచూసుకోవాలి. శామ్ సంగ్ కస్టమర్లు సెట్టింగ్స్ లోకి వెళ్లి, కనెక్షన్స్ ఎంపిక చేసుకోవాలి. సిమ్ కార్డ్ మేనేజర్ సెలక్ట్ చేసుకుని, యాడ్ మొబైల్ ప్లాన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు క్యూఆర్ కోడ్ ఉపయోగించుకుని స్కాన్ చేయాలి.
యాపిల్ యూజర్లు అయితే సెట్టింగ్స్, సెలక్ట్ డేటా మొబైల్, యాడ్ డేటా ప్లాన్ ను క్లిక్ చేయాలి. పిక్సల్ కస్టమర్లు సెట్టింగ్స్ లోకి వెళ్లి నెట్ వర్క్ అండ్ ఇంటర్నెట్ ఆప్షన్ కు వెళ్లి అక్కడ మొబైల్ నెట్ వర్క్ ఎంచుకోవాలి. డౌన్ లోడ్ ఈ సిమ్ ఇన్ స్టెడ్ అని క్లిక్ చేయాలి. తర్వాత నెక్ట్స్ ను సెలక్ట్ చేయాలి. మెయిల్ కు వచ్చిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి.
ఈ-సిమ్ కార్డు నుంచి సిగ్నల్ కవరేజీ ఏ మేరకు ఉంటుందన్నది తెలియదు. పైగా భౌతికంగా తరచూ ఫోన్లు, సిమ్ కార్డులను మార్చే వారికి ఈ సిమ్ అనుకూలం కాదు.