అసంపూర్తిగా ఉందంటూ ఎమ్మెల్సీ అనంతబాబుపై చార్జ్‌షీట్‌ను తిరస్కరించిన కోర్టు

  • మే 19న సుబ్రహ్మణ్యం హత్య
  • అదే నెల 23న ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్
  • మొన్న చార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు
  • తిప్పి పంపిన కోర్టు
తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబుపై పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో మే 23న అరెస్ట్ అయిన అనంతబాబు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేసి 90 రోజులు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాకినాడ పోలీసులు మొన్న రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 

అయితే, అది అసంపూర్తిగా ఉందని న్యాయస్థానం వెనక్కి పంపింది. కాగా, బెయిలు కోరుతూ అనంతబాబు మూడోసారి దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. కాగా, మే 19న దళిత యువకుడైన సుబ్రహ్మణ్యం హత్య జరిగింది.


More Telugu News