చిరంజీవిని చేతులు కట్టుకునేలా చేస్తారా?.. మీకేమైనా కొమ్ములున్నాయా?: పవన్ ఫైర్
- సిద్ధవటంలో జగన్‌పై మండిపడిన పవన్ కల్యాణ్
- ముఖ్యమంత్రి అయితే పై నుంచి దిగివచ్చారా? అని ప్రశ్న
- ఆధిపత్య ధోరణి తనకు నచ్చలేదన్న పవన్
- ఆత్మగౌరవం చంపుకోలేకే భీమ్లానాయక్‌ను వదిలేశానన్న జనసేనాని
- ఆత్మగౌరవాన్ని చంపుకుని బతికేలా ఈ దేశం తమను పెంచలేదన్న పవన్
జనసేన ప్రారంభించిన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్న ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని సిద్ధవటం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రచ్చబండలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా చూద్దామనుకున్న వ్యక్తిని చేతులు కట్టుకునేలా చేశారంటూ మండిపడ్డారు. ఇది ఆయన అహంకారాన్ని సూచిస్తోందన్నారు. కోట్లాదిమందికి తెలిసిన హీరోని, తన కుటుంబంలోని వ్యక్తితో చేతులెత్తి మొక్కించాడంటే ఈ వ్యక్తిని ఏమనుకోవాలని ప్రశ్నించారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేని, అంత అహంకారం పనికి రాదని అన్నారు. చిరంజీవి లాంటి వ్యక్తికే అలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.
తమ బలం, తమ ఆత్మగౌరవం మీదే తాము బతకాలనుకుంటున్నామన్న పవన్.. తాము కష్టపడి తినడానికి కూడా మీకొచ్చి నమస్కారం పెట్టాలంటే తమ ఆత్మగౌరవం ఒప్పుకోదన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకోలేకే భీమ్లానాయక్‌ను వదిలేశానని చెప్పుకొచ్చారు. మాకు ఎదురుతిరిగితే మెగాస్టార్‌నైనా కింద కూర్చోబెడతామన్న ఆధిపత్య ధోరణి సరికాదన్నారు. ఇది ఏ ఒక్కరికో సంబంధించిన విషయం కాదని, ఆత్మగౌరవానికి, అస్థిత్వానికి సంబంధించిన విషయమన్నారు. ముఖ్యమంత్రి అయితే నువ్వేమైనా దిగొచ్చావా? మీకేమైనా కొమ్ములున్నాయా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతకాలమని భయడతామని, ఎవరికని భయపడతామని అన్నారు. ఆస్తులు ఉంటే ఉంటాయి, పోతే పోతాయని, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకోలేమన్నారు. ఈ దేశం తమనలా పెంచలేదని పవన్ అన్నారు. రాయలు తిరిగిన నేలపై, ఆయన స్ఫూర్తితో తిరిగిన వాళ్లమని తాము తగ్గబోమని పవన్ తేల్చి చెప్పారు.