కాంగ్రెస్ నుంచి నటి త్రిషకు ఆఫర్లు.. పార్టీలో చేరాలంటూ ఆహ్వానం?
- త్రిషతో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరిపినట్టు తమిళ వెబ్‌సైట్లలో వార్తలు
- ఖుష్బూ లేని లోటును తీర్చాలని యోచిస్తున్న కాంగ్రెస్
- బీజేపీ చూపు కూడా త్రిష వైపే..
కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి త్రిష రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సినీ పరిశ్రమలో అవకాశాలు సన్నగిల్లుతుండడంతో ఆమె ఇప్పుడు రాజకీయాలపై దృష్టి సారించినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ఆమెకు ఆహ్వానం అందినట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం తమిళనాట రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖులను పార్టీల్లో చేర్చుకోవడం ద్వారా గ్లామర్ లుక్ తీసుకురావాలని పార్టీలన్నీ యోచిస్తున్నాయి.
అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ త్రిషను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో సీనియర్ నటి ఖుష్బూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. దీంతో ఇప్పుడామె లేని లోటును త్రిష ద్వారా తీర్చాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు సీనియర్ నేతలు ఇటీవల త్రిష ఇంటికి వెళ్లి మంతనాలు జరిపినట్టు తమిళ వెబ్ సైట్లు కొన్ని కథనాలు రాశాయి. మరోవైపు, తమిళనాడులో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ కూడా త్రిష వైపే చూస్తున్నట్టు సమాచారం.