కాకినాడ బీచ్ అందాల‌ను వ‌ర్ణిస్తూ వీడియో పోస్ట్ చేసిన వైసీపీ ఎంపీ ప‌రిమ‌ళ్ న‌త్వానీ

  • గ‌తంలో రిషికొండ బీచ్‌ను వ‌ర్ణిస్తూ ట్వీట్ చేసిన న‌త్వానీ
  • తాజాగా కాకినాడ తీరాన్ని వ‌ర్ణిస్తూ వీడియో పోస్ట్ చేసిన వైనం
  • ఆంధ్రా ప్రాంతానికి మాత్ర‌మే సొంత‌మైన వంట‌కాల‌కు కేరాఫ్ అడ్రెస్ అంటూ కితాబు
ఏపీలో తీర‌ప్రాంతంలోని బీచ్‌ల అందాల‌ను వ‌ర్ణిస్తూ రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ డైరెక్ట‌ర్‌, వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ప‌రిమ‌ళ్ న‌త్వానీ రెండో వీడియోను శ‌నివారం సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేశారు. ఇదివ‌ర‌కు విశాఖ‌లోని రిషికొండ బీచ్ వాతావ‌ర‌ణాన్ని ప్ర‌స్తావిస్తూ న‌త్వానీ ఓ వీడియో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కాకినాడ బీచ్ అందాల‌ను వ‌ర్ణిస్తూ ఆయ‌న మ‌రో వీడియోను శ‌నివారం పోస్ట్ చేశారు.

ఏపీలోని కాకినాడ బీచ్ అహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంతో కూడుకున్న‌ద‌ని న‌త్వానీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా సెల‌వుల‌ను ప్ర‌శాంతంగా ఆస్వాదించాలనుకునే వారికి ఈ బీచ్ చ‌క్క‌గా స‌రిపోతుంద‌ని తెలిపారు. ఆంధ్రా ప్రాంతానికి మాత్ర‌మే సొంత‌మైన వంట‌కాల‌కు కాకినాడ బీచ్ కేరాఫ్‌గా నిలుస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. ఇక కాకినాడ తీరానికి ఆనుకున్న ఉన్న వ‌న్య‌ప్రాణి ఆవాసాలు ప‌ర్యాట‌కుల‌ను మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటాయ‌ని న‌త్వానీ తెలిపారు.


More Telugu News