పోలీసు యూనిఫాంలో మునావర్ షోకు వచ్చిన బీజేపీ కార్యకర్త... పట్టుకుని చితకబాదిన పోలీసులు
- శిల్పకళా వేదికలో మునావర్ షో
- బీజేపీ బెదిరింపులతో భారీ బందోబస్తు
- ఖాకీ దుస్తుల్లో వచ్చిన బీజేపీ కార్యకర్త
- గుర్తించి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
తీవ్ర ఉద్రిక్తతల మధ్య శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక కేంద్రంగా స్టాండప్ కామెడీ స్టార్ మునావర్ ఫారూఖీ షో మొదలైంది. తన షోలలో హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యవహరిస్తారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫారూఖీ షోకు తెలంగాణ ప్రభుత్వం తొలుత అనుమతి ఇవ్వలేదు. అయితే షోకు ఇంకో రెండు రోజుల సమయం ఉందనగా... ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన సంగతి తెలిసిందే.
మునావర్ ఫారూఖీ షోను అడ్డుకుంటామని బీజేపీ శ్రేణులు, ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శిల్పకళా వేదిక వద్ద వేలాది సంఖ్యలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎలాగైనా ఫారూఖీ షోకు హాజరై... ఆతడేమాత్రం మాట తప్పినా దాడి చేయాలన్న సంకల్పంతో సాగిన ఓ బీజేపీ కార్యకర్త పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల కళ్లుగప్పేందుకు పోలీసు యూనీఫాంలోనే శిల్పకళా వేదిక వద్దకు వెళ్లిన అతడిని లోపలికి ప్రవేశించకుండానే పోలీసులు గుర్తించారు. దీంతో వెనువెంటనే అతడిని పట్టుకున్న పోలీసులు అక్కడే లాఠీలతో చితక్కొట్టారు. అనంతరం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.