దూసుకుపోతున్న సిద్ శ్రీరామ్ సాంగ్!

  • విభిన్నమైన కథాచిత్రంగా 'కృష్ణమ్మ'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • సంగీత దర్శకుడిగా కాలభైరవ 
  • దర్శకుడిగా గోపాలకృష్ణ  పరిచయం   
సత్యదేవ్ హీరోగా 'కృష్ణమ్మ' సినిమా రూపొందింది. కొమ్మలపాటి కృష్ణ నిర్మించిన ఈ సినిమాకి గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా రాజీ పరిచయమవుతోంది. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి నిన్న ఒక పాటను రిలీజ్ చేశారు.

'ఏమవుతుందో మనలో .. మన మనసులలో, ఏం జరిగిందో కలలో తలమునకలలో' అంటూ ఈ పాట సాగుతోంది. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ పాటను అలా యూ ట్యూబ్ లో వదిలారో లేదో వ్యూస్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

ఇప్పటికే ఈ సాంగ్ 1.2 మిలియన్ ప్లస్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. కాలభైరవ ట్యూన్ .. తేలికైన పదాలతో అనంత శ్రీరామ్ అల్లిక .. సిద్ శ్రీరామ్ వాయిస్ లోని ప్రత్యేకత ఈ పాటకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. రెండు ప్రేమ జంటలపై చిత్రీకరించిన ఈ పాట యూత్ తో మాస్ ను కూడా ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాను కొరటాల శివ సమర్పిస్తూ ఉండటం విశేషం.


More Telugu News