పవన్ కడప పర్యటనలో అపశ్రుతి... కాన్వాయ్ వాహనాలు ఢీకొని 10 మందికి గాయాలు
- కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా పయనం
- మలినేనిపట్నం వద్ద ఢీకొన్న వాహనాలు
- క్షతగాత్రులు కడప రిమ్స్‌కు తరలింపు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం కడప జిల్లా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి విమానంలో కడప ఎయిర్‌పోర్టు చేరుకున్న పవన్... అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సిద్ధవటం పయనమయ్యారు. మరికాసేపట్లోనే అక్కడికి చేరుకుంటారనగా.. పవన్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. సిద్ధవటం మండలం మలినేనిపట్నం వద్ద పవన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా... వారిని హుటాహుటీన కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
సాగు కలిసి రాక ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే నిమిత్తం జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పేరిట భారీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమం కింద పలు జిల్లాల్లో పర్యటించిన పవన్.. శనివారం ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమంలో బాధిత కుటుంబాలతో మాట్లాడనున్నారు. అదే సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న రౌలు రైతుల కుటుంబాలకు ఆయన రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.